కొత్తపేటలో 'రైతన్నా మీకోసం'
కోనసీమ: కొత్తపేట(మం) పలివెల సిరిపాలెంలో జరిగిన 'రైతన్నా మీకోసం' కార్యక్రమంలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పాల్గొన్నారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందని, పంచ సూత్రాలతో వ్యవసాయం పండగలా మారుతుందని ఎమ్మెల్యే అన్నారు. రైతన్నా మీకోసం కరపత్రాలను ఇంటింటికి వెళ్లి అందజేశారు. సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయ్యిందని చెప్పుకొచ్చారు.