VIDEO: విషాదం: రెండేళ్ల కొడుకుతో కలిసి తల్లి సూసైడ్.!
MDK: ఇంట్లో తల్లి, కొడుకు ఆత్మహత్య చేసుకున్న విషాదకర ఘటన చిన్నశంకరంపేట మండలంలో ఇవాళ జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖాజాపూర్ గ్రామానికి చెందిన అఖిల తన రెండేళ్ల కుమారుడు రియాన్స్ గౌడ్‌తో కలిసి ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.