జలవిహార్‌లో ప్రమాదం.. ఒకరు మృతి
HYD: జలవిహార్‌లో ఆర్వో ఫిల్టర్ ప్లాంట్‌లో బుధవారం పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో గాయపడి సోమాజిగూడలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న లక్ష్మణ్ (40) అనే వ్యక్తి మృతి చెందాడు. ప్లాంట్‌లోని కంప్రెషర్‌లో అధిక ప్రెషర్ ఏర్పడడమే పేలుడుకు కారణమని అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.