VIDEO: కంటతడి పెట్టిన మున్సిపల్ ఛైర్మన్
JN: స్టేషన్ ఘనపూర్ పట్టణంలో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు చింతకుంట్ల నరేందర్ రెడ్డి సంతాపసభ శుక్రవారం నిర్వహించారు. కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ తాటికొండ వినయ్ కుమార్ పాల్గొని, తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. తనకు రాజకీయ జీవితం అందించిన గురువు ఇక తమ మధ్య లేకపోవడం ఎంతో బాధాకరమని కంటతడి పెట్టారు. MLA కడియం శ్రీహరి ఆయనను ఓదార్చారు.