దండమూడి పాఠశాలలో ఎంఈవో ఆకస్మిక తనిఖీ

దండమూడి పాఠశాలలో ఎంఈవో ఆకస్మిక తనిఖీ

GNTR: పొన్నూరు మండలం దండమూడి ఎంపీయూపీ పాఠశాలను ఎంఈవో రాజు గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల రికార్డులు, విద్యార్థుల హాజరు పట్టికలను ఆయన పరిశీలించారు. విద్యార్థుల విద్యా సామర్థ్యాలను పరిశీలించి, మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును కూడా తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.