గాయపడ్డ వ్యక్తి చికిత్స పొందుతూ మృతి
NLR: మర్రిపాడు మండలం సింగనపల్లి వద్ద 565 జాతీయ రహదారిపై సోమవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఉదయగిరి మండలం, కృష్ణంపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాసులు బైకుపై వెళుతుండగా అదుపు తప్పి కిందపడ్డారు. తీవ్ర గాయాలైన అతడిని హైవే అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ తిరుపతిలో మృతిచెందారు.