బీఈడీ పరీక్షా రివాల్యుయేషన్ ఫలితాలు విడుదల

HYD: ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని బీఈడీ పరీక్షా రివాల్యుయేషన్ ఫలితాలు విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ తెలిపారు. బీఈడీ మొదటి సెమిస్టర్ రివాల్యుయేషన్ ఫలితాలను విడుదల చేసినట్లు చెప్పారు. పరీక్షా ఫలితాల పూర్తి వివరాలను ఓయూ వెబ్‌సైట్ www.osmania.ac.inలో చూసుకోవచ్చని సూచించారు.