'గంజాయి రహిత జిల్లా ఏర్పాటుకు సహకరించాలి'

'గంజాయి రహిత జిల్లా ఏర్పాటుకు సహకరించాలి'

ADB: గంజాయి రహిత జిల్లా ఏర్పాటుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని బోథ్ CI గురుస్వామి పిలుపునిచ్చారు. జొన్న పంటలో అంతర పంటగా గంజాయి మొక్కలను పెంచుతున్న చింతల్ బోరి, ధర్మపురి గ్రామానికి చెందిన ముకుందరావు, మారుతి అనే నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు వెల్లడించారు. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, వ్యసనాల బారిన పడకుండా ఉండాలని CI తెలిపారు.