స్నానానికి వెళ్లి గుండెపోటుతో మృతి
గద్వాల జిల్లా బీచుపల్లి సమీపంలోని కృష్ణా నది పుష్కర ఘాట్ వద్ద మంగళవారం రాజమండ్రికి చెందిన వేముని రుక్మిణినాథ్ (60) అనే వ్యక్తి మృతి చెందారు. వృత్తి రీత్యా జాతకాలు చెప్పే ఆయన, బీచుపల్లి ఆంజనేయ స్వామిని దర్శించుకునేందుకు వచ్చి నదిలో స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు గుండెపోటు రావడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.