గొలుగొండలో HPV టీకా పంపిణీ

గొలుగొండలో HPV టీకా పంపిణీ

AKP: గర్భాశయ ముఖ క్యాన్సర్ నివారణ కోసం ప్రభుత్వం చేపట్టిన ఉచిత హెచ్‌పీవీ టీకా కార్యక్రమం గొలుగొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించారు. వైద్యాధికారి శ్యామ్ కుమార్ పర్యవేక్షణలో 14–15 ఏళ్ల మధ్య బాలికలకు హెచ్‌పీవీ టీకాలు వేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు టీకా ప్రాధాన్యంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది నాయకులు పాల్గొన్నారు.