'తిరుపతి ఘటన చాలా బాధాకరం'

'తిరుపతి ఘటన చాలా బాధాకరం'

W.G: తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మృతి చెందడం చాలా బాధాకరమని తణుకు మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. ఈ సందర్భంగా గురువారం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ముక్కోటి ఏకాదశి వచ్చిందంటేనే ఆలయానికి లక్షలాది సంఖ్యలో భక్తులు వస్తారని అన్నారు. అయితే ప్రభుత్వం ఒక పద్ధతి ప్లానింగ్ లేకుండా చేయడం వల్లే ఈ ఘటన జరిగిందని అన్నారు.