నేడు గ్రంథాలయ వారోత్సవాలు ముగింపు
VZM: గురజాడ స్మారక జిల్లా కేంద్రంలోని లైబ్రరీలో గురువారం ఉదయం 11 గంటలకు 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి బి. లక్ష్మీ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఉత్తమ గ్రంథాలయ ఉద్యోగికి గ్రంథాలయ ఉద్యమ నేత జయంతి రామలక్షణామూర్తి స్మారక పురస్కారంను ప్రదానం చేయనున్నట్లు పేర్కొన్నారు.