చంద్రశేఖరపురంలో పర్యటించిన ఎమ్మెల్యే

చంద్రశేఖరపురంలో పర్యటించిన ఎమ్మెల్యే

ప్రకాశం: చంద్రశేఖరపురం మండలంలో ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి శుక్రవారం పర్యటించారు. మండలం చింతపూడి గ్రామంలో రూ .60 లక్షల వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. ఇందులో భాగంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికే సాధ్యమని అన్నారు. అనంతరం చంద్రశేఖరపురం మండలాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తామన్నారు.