'ట్రాక్టర్ నడిపిన మంత్రి తుమ్మల'

'ట్రాక్టర్ నడిపిన మంత్రి తుమ్మల'

KMM: వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గురువారం ట్రాక్టర్ నడుపుతూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. సత్తుపల్లి మండలం యాతలకుంట వద్ద టన్నెల్‌ను పరిశీలించడానికి వెళ్లిన మంత్రి తుమ్మల అక్కడ ఉన్న ట్రాక్టర్‌ను స్వయంగా నడుపుతూ పనులను పరిశీలించారు. వీలైనంత త్వరగా పనులను పూర్తి చేయాలని సంబంధిత అధికారులను మంత్రి తుమ్మల ఆదేశించారు.