రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు
ప్రకాశం: చీమకుర్తి-తూర్పు గంగవరం మార్గంలో రోడ్డు ప్రమాదం జరిగింది. తూర్పు గంగవరం నుంచి పల్లామల్లికి పసువుల లిక్విడ్ లోడ్తో వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి 33 కేవీ పవర్ స్టేషన్ సమీపంలో సైడ్ గుంతలోకి పడిపోయింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ కాలు ఇరుక్కుపోయి తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రున్ని 108 అంబులెన్స్‌లో ఒంగోలు రిమ్స్‌కు తరలించినట్లు సమాచారం.