విద్యుత్ షాక్‌తో మరణించిన కుటుంబానికి ఎంపీ భరోసా

SDPT: మిరుదొడ్డి మండలం అల్వాల గ్రామంలో విద్యుత్ షాక్‌తో మరణించిన పుల్ల పరశురాములు కుటుంబాన్ని సోమవారం మెదక్ ఎంపీ రఘునందన్ రావు పరామర్శించారు. వారికి అండగా ఉంటానని హామీ ఇచ్చి, వారి కుటుంబానికి రూ.50 వేలు డిపాజిట్ చేసిన పత్రాలను బీజేపీ మండల అధ్యక్షులు జిగిరి అమర్ ఆధ్వర్యంలో అందించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.