VIDEO: ఎదులాబాద్ చెరువు పరిసరాల్లో కోతుల బెడద
MDCL: ఎదులాబాద్ చెరువు పరిసరాల్లో కోతుల బెడద రోజురోజుకీ పెరుగుతోంది. ఉదయం, సాయంత్రం వేళల్లో గుంపులుగా సంచరిస్తూ స్థానికులను భయాందోళనలకు గురి చేస్తున్నాయి. ఇళ్ల పైకప్పుల పైకి ఎక్కి ఆహార పదార్థాలు దోచుకెళ్లడం, పిల్లలు, వృద్ధుల పై దాడి చేసే ప్రయత్నాలు చేయడం వంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. చెరువు చుట్టూ నడకకు వెళ్లే వారు భయంతో వెనక్కి తిరుగుతున్నారు.