VIDEO: రోడ్డు లేక ఇబ్బంది పడుతున్న తండావాసులు
MHBD: తొర్రూర్ మండలం కంఠాయపాలెం గ్రామపంచాయతీ పరిధిలోని కన్నా తండాకు సరైన రోడ్డు మార్గం లేక స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కంకర పోసినా తారు రోడ్డు వేయకుండా.. అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమస్య పై సంబంధిత అధికారులు వెంటనే స్పందించి తారు రోడ్డు వేయాలని ప్రయాణికులు డిమాండ్ చేశారు.