ధాన్యం సేకరణకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు
ఏలూరు జిల్లాలో ఖరీఫ్ పంట ధాన్యం కనీస మద్దతు ధర 'గ్రేడ్-ఏ' రకం క్వింటాల్‌కు రూ. 2,389, కామన్ రకం రూ. 2,369 చొప్పున నిర్ణయించినట్లు సివిల్ సప్లై మేనేజర్ శివరామమూర్తి సోమవారం తెలిపారు. జిల్లాలో 234 రైతు సేవా కేంద్రాలు, 102 ఏజెన్సీల ద్వారా ధాన్యం సేకరణకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశామని.. రైతులకు 18004256453, 7702003584 నంబర్స్‌తో కంట్రోల్ ఏర్పాటు చేశామన్నారు.