నల్లచెరువును పరిశీలించిన హైడ్రా కమిషనర్

MDCL: చెరువుల సుందరీకరణలో భాగంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూకట్ పల్లిలోని నల్లచెరువు అభివృద్ధి పనులను గురువారం పరిశీలించారు. తమపై వచ్చిన విమర్శలను తట్టుకొని చెరువును సుందరీకరించినట్లు తెలిపారు. ఈ పనుల వల్ల చెరువు విస్తీర్ణం 10 ఎకరాలు పెరిగిందని, నీటినిలువ సామర్థ్యం పెరిగి వరదల ముప్పు తగ్గిందని చెప్పారు. డ్రైనేజీలు కలవకుండా చర్యలు తీసుకున్నామన్నారు.