ఘట్‌కేసర్ నుంచి ORR వైపు వెళ్తున్నారా..? జాగ్రత్త.!
MDCL: ఘట్‌కేసర్, ఉప్పల్ తదితర ప్రాంతాల నుంచి ORR కీసర వైపు వెళ్లేవారు ఉదయం సమయంలో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ORR ఘట్‌కేసర్ నుంచి కీసర వైపుకు వెళ్లే మార్గంలో ముఖ్యంగా ఉదయం సమయంలో పొగ మంచు గత 4 రోజులుగా విపరీతంగా ఉంటుంది. ఉదయం 8 గంటల వరకు వాహనాలు కనిపించని పరిస్థితి. ఈ నేపథ్యంలో వాహనదారులు నిదానంగా వెళ్లాలని సూచిస్తున్నారు.