ధాన్యం నగదు చెల్లింపులో జనగామ మొదటి స్థానం

ధాన్యం నగదు చెల్లింపులో జనగామ మొదటి స్థానం

JN: రైతులకు ధాన్యం నగదు చెల్లింపులో జనగామ జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. గత నెల 19వ తేదీ నుంచి ఇప్పటి వరకు 80 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. రైతుల ఖాతాల్లో ఇప్పటి వరకు రూ.127 కోట్లు జమ అయ్యాయి. ఇంకా రూ.64.79 కోట్లు చెల్లించాల్సి ఉంది. సకాలంలో నగదు చెల్లిస్తుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.