తుంగభద్ర జలాశయం తాజా సమాచారం
ATP: జిల్లా ప్రజలకు HLC ద్వారా తాగు, సాగు నీరు అందించే తుంగభద్ర జలాశయానికి వరద స్వల్పంగా చేరుతోంది. శుక్రవారం ఉదయం 7 గంటల సమయంలో డ్యాంలోకి 591 క్యూసెక్కుల నీరు చేరుతోందని అధికారులు తెలిపారు. దీంతో జలాశయం నుంచి నీటి విడుదలను అధికారులు పూర్తిగా నిలిపివేశారు. ప్రస్తుతం తుంగభద్ర డ్యాంలో 67.109 టీఎంసీల నీరు నిల్వ ఉంది.