తెలకపల్లి‌లో కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు

తెలకపల్లి‌లో కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు

NGKL: తెలకపల్లి మండలంలో బీఆర్ఎస్‌కు శనివారం దిమ్మ తిరిగే షాక్ తగిలింది. BRS ముఖ్య అనుచరుడు, మాజీ వార్డు మెంబర్ చక్రవర్తితో పాటు మరో 15 మంది యువకులు స్థానిక ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై పార్టీ మారినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.