నిజాంసాగర్ ప్రాజెక్టు 3 గేట్లు ఎత్తివేత

KMR: నిజాంసాగర్ ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతాల నుంచి నీటి ప్రవాహం తగ్గుముఖం పట్టింది.శుక్రవారం మధ్యాహ్నం వరకు ప్రాజెక్టులోకి 27,933 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైందని ఏఈఈ సాకేత్ తెలిపారు. ప్రాజెక్టు 3 గేట్లు ఎత్తి 15,849 క్యూసెక్కుల నీటిని మంజీరా నదిలోకి విడుదల చేస్తున్నారు.ప్రాజెక్టులో ప్రస్తుతం 16.603 టీఎంసీల నీటి నిల్వ ఉంది.