రాజుపాలెంలో ఎంపీ ప్రత్యేక పూజలు

KDP: రాజుపాలెం మండలంలోని గోయపల్లిలోని దేవాలయంలో బుధవారం కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, జిల్లా పరిషత్ ఛైర్మన్ ముత్యాల రాంగోపాల్ రెడ్డి ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. వీరితో పాటు మైదుకూరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురాం రెడ్డి, రాజుపాలెం మండల వైసీపీ నాయకులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.