ఆర్థిక అసమానతలు తొలగించేందుకే P-4: కమిషనర్

ఆర్థిక అసమానతలు తొలగించేందుకే P-4: కమిషనర్

TPT: సమాజంలో ఆర్థిక అసమానతలు తొలగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం P-4ను అమలు చేస్తుందని నాయుడుపేట మున్సిపల్ కమిషనర్ ఫజులుల్లా తెలిపారు. బుధవారం ఆయన తన కార్యాలయంలో మాట్లాడుతూ.. నాయుడుపేట మున్సిపాలిటీలో P-4 పేదరిక నిర్మూలనకు ఎంతగానో దోహదం చేస్తుందన్నారు. మున్సిపాలిటీలోని 25 వార్డుల్లోని 13 సచివాలయాల పరిధిలో 1,057 కుటుంబాలను గుర్తించినట్లు పేర్కొన్నారు.