చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి
BDK: చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి చెందిన ఘటన మణుగూరు అటవీ ప్రాంతంలో చోటుచేసుకుంది. తోగు- బుగ్గ దగ్గర అటవీ ప్రాంతంలో వేటగాళ్లు వన్యప్రాణుల కోసం విద్యుత్ తీగలు ఏర్పాటు చేశారు. అదే ప్రాంతంలో సుమన్ వేటకు వెళ్లడంతో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌తో మృతి చెందాడు. ఈ ఘటనలో మరో ముగ్గురు వేటగాళ్లు తృటిలో తప్పించుకున్నారు.