ఆర్టీసీ డిపో సందర్శించిన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్

NLR: నెల్లూరు ఏపీఎస్ఆర్టీసీ జోన్ - 3 ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గిడుగు వెంకటేశ్వరరావు శుక్రవారం ఉదయం ఉదయగిరి ఆర్టీసీ డిపోను సందర్శించారు. డిపో పరిసరాలను పరిశీలించిన ఆయన సిబ్బందికి పలు సూచనలు చేశారు. డిపోలో పనిచేసే ఉద్యోగులు సిబ్బంది సమన్యాయంతో పనిచేసే సంస్థకు మంచి పేరు తీసుకోరావాలని సూచించారు. అనంతరం డిపో ఆవరణలో మొక్కలు నాటారు.