జీవీఎంసీలో ‘నమస్తే’ స్కీమ్ ప్రారంభం

జీవీఎంసీలో ‘నమస్తే’ స్కీమ్ ప్రారంభం

VSP: జీవీఎంసీ పరిధిలో సెప్టిక్ ట్యాంక్, యూజీడీ కార్మికుల ఆరోగ్య, బీమా, సంక్షేమ సదుపాయాల కోసం నమస్తే స్కీమ్‌ను మంగళవారం అదనపు కమిషనర్ పి.నల్లనయ్య ప్రారంభించారు. కేంద్ర మార్గదర్శకాల మేరకు నవజీవన్ ఆర్గనైజేషన్ ద్వారా అమలు చేస్తూ, కార్మికులను గుర్తించి ఆధార్, బ్యాంక్ వివరాలతో పథకంలో చేర్పించనున్నారు. పీఎఫ్, ఈఎస్ఐ లేని కార్మికులను కూడా రెండో దశలో చేరుస్తామన్నారు