సినిమాలకు త్రిష గుడ్ బై..?
స్టార్ హీరోయిన్ త్రిష సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నారంటూ నెట్టింట జోరుగా ప్రచారం సాగుతోంది. చిరంజీవితో నటిస్తున్న 'విశ్వంభర', అలాగే సూర్య 'కరుప్పు' చిత్రాలు పూర్తయిన తర్వాత ఆమె సినిమాల నుంచి తప్పుకుంటున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, ఈ ప్రచారంపై త్రిష నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. మరోవైపు, సినీ వర్గాలు మాత్రం ఇవన్నీ కేవలం పుకార్లేనని కొట్టిపారేస్తున్నాయి.