VIDEO: పెద్దవాగును పరిశీలించిన కలెక్టర్

VIDEO: పెద్దవాగును పరిశీలించిన కలెక్టర్

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. మహాముత్తారం మండలంలో కేశవాపూర్ - పెగడపల్లి మధ్య ప్రవహిస్తున్న పెద్దవాగును మంగళవారం జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పరిశీలించారు. పరిస్థితులను అంచనా వేసి అవసరమైన సహాయక చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.