అనాధ పిల్లలకు 4 లక్షల సహాయం
SRD: కరోనా సమయంలో తల్లిదండ్రులు కోల్పోయి అనాధలుగా మిగిలిన 20 మంది పిల్లలకు మెద్వాన్ ఆధ్వర్యంలో 4 లక్షల రూపాయల సహాయాన్ని సంస్థ డైరెక్టర్ మధుసూదన్ రెడ్డి మంగళవారం అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. అనాధ పిల్లల ఉన్నత చదువు కోసం సహకారం అందించినట్లు చెప్పారు. కార్యక్రమంలో కోఆర్డినేటర్లు స్వప్న, ముజీబ్, హాఫీద్, ఆమదయ్య పాల్గొన్నారు.