దేవరకొండలో 10 తులాల బంగారం నగదు అపహరణ..!
NLG: దేవరకొండ పట్టణం గాంధీనగర్లో దొంగలు హల్చల్ చేశారు. శతవేలి శ్రీనివాసరావు, లీలారాణి దంపతుల ఇంట్లోకి చొరబడిన దుండగులు.. బీరువాలో ఉన్న 10 తులాల బంగారం రూ. 25,000 నగదును ఎత్తుకెళ్లారు. తమ సొమ్ము పోవడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.