రైతు బజార్లకు డిమాండ్..!

రైతు బజార్లకు డిమాండ్..!

RR: ప్రస్తుతం GHMC పరిధి విస్తరించడంతో వారాంతపు సంతలు ఇతర ప్రాంతాల్లో కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఈ క్రమంలో రైతు బజార్లను పెంచే అవకాశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. సాధారణ మార్కెట్లతో పోలిస్తే రైతు బజార్లలో ధరలు 30-40 శాతం వరకు తక్కువగా ఉండటంతో ప్రజలకు ఉపశమనం కలుగుతుంది. శంషాబాద్, ఉప్పల్ ప్రాంతాల్లో రైతు బజార్లకు బాగా డిమాండ్ ఏర్పడింది.