పొలంలో పడి రైతు మృతి
MDK: పొలంలో పడి ఓ రైతు మృతి చెందిన ఘటన రామాయంపేట మండలంలో చోటుచేసుకుంది. మండల పరిధిలోని తొనిగండ్ల గ్రామానికి చెందిన డబ్బు వెంకటేష్ అనే రైతు ఆదివారం తన వ్యవసాయ పొలం వద్దకు వెళ్ళగా పొలం పనులు చేస్తున్న క్రమంలో ఫిట్స్ రావడంతో బురదలో పడిపోయాడు. వెంటనే స్పందించిన స్థానికులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.