మడకశిర KGBV వసతి గృహాన్ని కలెక్టర్ తనిఖీ
సత్యసాయి: మడకశిరలోని KGBV వసతి గృహాన్ని జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ ఐఏఎస్, ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజుతో కలిసి పరిశీలించారు. విద్యార్థుల వసతి, భోజనం, భద్రత, సౌకర్యాలను క్లెక్టర్ సమీక్షించి అవసరమైన సూచనలు ఇచ్చారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. విద్యార్థులకు మెరుగైన వసతి సేవలు అందేలా చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.