VIDEO: జాతీయ రహదారిపై వాహనాల రద్దీ
MBNR: బాలానగర్ మండల కేంద్రంలో ఆదివారం 44వ జాతీయ రహదారి వాహనాలతో రద్దీగా మారింది. సెలవు దినం కావడంతో గద్వాల, వనపర్తి, మహబూబ్ నగర్, మక్తల్, నారాయణపేట, జడ్చర్ల, దేవరకద్ర ప్రాంతాలకు వెళ్లే వాహనదారులు అధిక సంఖ్యలో ప్రయాణించడంతో రద్దీ పెరిగింది. సెలవు రోజుల్లో కూడా సమయానికి గమ్య స్థానాలకు చేరుకోలేకపోతున్నామని పలువురు స్థానికులు తెలిపారు.