వేంకటేశ్వర స్వామి ఆలయ అభివృదికై రూ.110 కోట్లు

వేంకటేశ్వర స్వామి ఆలయ అభివృదికై రూ.110 కోట్లు

VKB: కొడంగల్ పట్టణంలోని శ్రీ మహాలక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని రూ.110 కోట్లతో అభివృద్ధి చేయనున్నారు. భూసేకరణ కోసం ప్రభుత్వం మొదటి విడతలో రూ. 33 కోట్లు మంజూరు చేసింది. నిర్వాసితుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేయనున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. సీఎం ఆదేశాల మేరకు రెండేళ్లలోపు పనులు పూర్తి చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.