మీకు 2 పిల్లర్లు కట్టడానికి 2 ఏళ్లు పట్టింది: భూపేశ్ రెడ్డి
KDP: వైసీపీ రాజకీయాల లబ్ధి కోసమే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని తెరపైకి తీసుకొచ్చిందని కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు భూపేశ్ రెడ్డి విమర్శించారు. జమ్మలమడుగులోని TDP కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ‘మీ హయాంలో పెన్నా నదిలో ఉన్న ముద్దనూరు బ్రిడ్జీలో 2 పిల్లర్లు కుంగితే వాటిని సరిచేయడానికి రెండేళ్లు పట్టింది. అని MP అవినాశ్ రెడ్డి, MLC రామసుబ్బారెడ్డిని ప్రశ్నించారు.