నూతన డీఎంహెచ్ఓగా డా.వై.కామేశ్వర ప్రసాద్
KRNL: జిల్లా నూతన డీఎంహెచ్ఓగా డాక్టర్ వై. కామేశ్వర ప్రసాద్‌ను నియమిస్తూ మంగళవారం రాత్రి ఆ శాఖ కార్యదర్శి సౌరభ్ గౌర్ ఉత్తర్వులు జారీ చేశారు. కోవిడ్ సమయంలో అనంతపురంలో సేవలందించిన ఆయనను డిప్యూటేషన్‌పై కర్నూలుకు పంపారు. మాజీ డీఎంహెచ్ఓ డాక్టర్ శాంతికళను విజయవాడకు బదిలీ చేయగా, డాక్టర్ ఎల్. భాస్కర్ ఇన్‌చార్జ్‌గా కొనసాగుతున్నారు.