ఉండి- ఆకివీడు రైల్వే గేటు మూసివేత
W.G: రైల్వే ఫ్లైఓవర్ పనులు జరుగుతున్నందున ఉండి- ఆకివీడు రైల్వే గేటును వచ్చే నెల ఒకటి నుంచి 20 వరకు మూసివేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ 20 రోజుల పాటు భీమవరం నుంచి ఆకివీడు వైపు వెళ్లేవారు, కైకలూరు నుంచి ఉండి వైపు వచ్చేవారు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ప్రయాణించాలని అధికారులు కోరారు. ప్రయాణీకులు, వాహనదారులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.