'మూడు మండలాలకు రూ.58 కోట్లు మంజూరు'

'మూడు మండలాలకు రూ.58 కోట్లు మంజూరు'

KMM: మధిర నియోజకవర్గంలోని మధిర, ఎర్రుపాలెం, బోనకల్లు మండల పరిషత్ నూతన భవనాల నిర్మాణానికి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కృషితో రూ.58 కోట్లు మంజూరయ్యాయి. ఇందులో భాగంగా మధిరకు రూ.21 కోట్లు, ఎర్రుపాలెంకు రూ.18.75 కోట్లు, బోనకల్‌కు రూ.18.25 కోట్లు కేటాయిస్తూ జీవో జారీ చేశారు. నియోజకవర్గాన్ని మోడల్‌గా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని భట్టి తెలిపారు.