సబ్ జైలును తనిఖీ చేసిన డీజీ సౌమ్య మిశ్రా
SRPT: రాష్ట్ర జైలు శాఖ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సౌమ్య మిశ్రా ఇవాళ సూర్యాపేట సబ్ జైలును తనిఖీ చేశారు. జైలు పరిసరాల పరిశుభ్రత, ఖైదీలకు అందుతున్న ఆహారం, వైద్య సదుపాయాలు, భద్రతా ఏర్పాట్లు వంటి అంశాలను సమగ్రంగా పరిశీలించారు. ఖైదీల సమస్యలు, అవసరాలు గురించి వివరాలు తెలుసుకున్నారు. జైలులో అవసరమైన మందులు సరిపడా ఉంచుకోవాలని వైద్య సిబ్బందికి సూచించారు.