'టమాటాకు ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించాలి'
AKP: టమాటాకు ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించి రైతులను ఆదుకోవాలని పాయకరావుపేట నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త కంబాల జోగులు డిమాండ్ చేశారు. మంగళవారం నక్కపల్లిలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వమే మార్కెటింగ్ శాఖ ద్వారా కొనుగోలు చేయాలని సూచించారు. పంటలకు నష్టం జరిగితే ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. పంటల బీమా ఇన్‌పుట్ సబ్సిడీ అమలు కావడం లేదన్నారు.