బాలిక హత్య కేసును ఛేదించిన పోలీసులు

బాలిక హత్య కేసును ఛేదించిన పోలీసులు

NRPT: నారాయణపేట మండల అమ్మిరెడ్డిపల్లిలో మార్చి 31న జరిగిన ఐదేళ్ల బాలిక హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు, అదే గ్రామానికి చెందిన బక్క చిన్న నరసింహులు(42)ను ప్రధాన నిందితుడిగా గుర్తించి అరెస్ట్ చేశారు. బాలికపై లైంగిక దాడి చేసి, ఆపై హత్య చేసినట్లు పోస్టుమార్టం నివేదికలో తేలిందని జిల్లా ఎస్పీ వినీత్ కుమార్ వెల్లడించారు.