ప్రజలకు అధికారులు సుపరిపాలన అందించాలి: కలెక్టర్

ప్రజలకు అధికారులు సుపరిపాలన అందించాలి: కలెక్టర్

SRPT: ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు ప్రజలకు సుపరిపాలన అందించాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం సూర్యాపేట కలెక్టరేట్‌లో నిర్వహించిన విజిలెన్స్ అవగాహన వారోత్సవాల్లో పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సేవలు సరైన రీతిలో ప్రజలకు చేరే విధంగా అధికారులు పారదర్శకతతో, బాధ్యతగా విధులు నిర్వహించాలన్నారు.