నేడు మందమర్రిలో పర్యటించనున్న మంత్రి వివేక్
మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలో ఇవాళ రాష్ట్ర కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి డా. జీ. వివేక్ వెంకటస్వామి పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు మందమర్రి పట్టణంలోని B1 కార్యాలయానికి మంత్రి రానున్నారు. ఈ సందర్భంగా ప్రస్తుత గ్రామపంచాయతీ ఎన్నికలు, అభివృద్ధి పనులపై నాయకులు, అధికారులతో ఆయన సమీక్షించనున్నారు.