బిగ్‌బాస్-9: ఈ వారం దివ్య ఔట్..?
బిగ్‌బాస్ సీజన్-9 నుంచి ఈ వారం దివ్య ఎలిమినేట్ కానున్నట్లు తెలుస్తోంది. నామినేషన్స్‌లో ఉన్న కంటెస్టెంట్లలో దివ్యకు అతి తక్కువ ఓట్లు నమోదైనట్లు సమాచారం. అత్యధిక ఓట్లతో అగ్రస్థానంలో కల్యాణ్, తొలిసారి నామినేట్ అయిన ఇమ్మాన్యుయేల్ రెండో స్థానాన్ని దక్కించుకున్నట్లు తెలుస్తోంది. దివ్య ఎలిమినేట్ అయితే, హౌస్‌లో ఇద్దరు కామనర్స్(కల్యాణ్, పవన్) మాత్రమే మిగులుతారు.