ఇంటర్ సప్లమెంటరీ పరీక్షల పీజు గడువు పెంపు

ఇంటర్ సప్లమెంటరీ పరీక్షల పీజు గడువు పెంపు

VSP: ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల ఫీజు చెల్లింపు గడువు ఈ నెల 5వ తేదీ (సోమవారం) వరకు పెంచినట్లు అల్లూరి జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారి సొంటేన భీమ శంకర్ రావు తెలిపారు. ఈ అవకాశాన్ని ఇంటర్ ఫెయిల్ అయిన వారితో పాటూ బెటర్మెంట్ రాసే విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. విద్యార్థులు తమ కళాశాలకు వెళ్లి ఫీజు చెల్లించాలన్నారు. తదుపరి గడువు పెంచబోరన్నారు.